భార్య వివాహేతర సంబంధం.. భర్త బలవన్మరణం
భార్య వివాహేతర సంబంధంతో మనస్తాపం చెందిన ఒక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో జరిగిం
భార్య వివాహేతర సంబంధంతో మనస్తాపం చెందిన ఒక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త ఆత్మహత్యకు సంబంధించిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుకథనం ప్రకారం.. ఏటి అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటరమణ దంపతులు. అయితే కుటుంబ జీవనంలో ఏర్పడిన విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భార్యా భర్తల మధ్య విభేదాలు గత కొంతకాలంగా నడుస్తున్నాయి.
విడాకులు ఇచ్చి.. ఇరవై లక్షలివ్వాలని...
అందులో వివాహేతర సంబంధం వల్ల తనకు విడాకులు ఇప్పించాలని భార్య భర్తవెంకటేశ్వర్లుపై వత్తిడి తెచ్చింది. అయితే ఇది భరించలేని వెంకటేశ్వర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడు వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ముందు ఓ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశాడు. అందులో తన భార్య వెంకటరమణకు లాయర్ తో వివాహేతర సంబంధం ఉందని, విడాకుల కోసం తనకు 20 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తోందని ఆరోపించాడు. అలాగే తనపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తానని చెప్పి వేధింపులకు పాల్పడుతోందని వెంకటేశ్వర్లు వీడియోలో తెలిపాడు.
ఒత్తిడి తట్టుకోలేక....
ఒత్తిడిని తట్టుకోలేకనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వీడియోలో వెల్లడించాడు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, మృతుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు భార్యతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. సంక్రాంతి పండగ కు ముందు కుటుంబంలో జరిగిన విషాదంతో బంధువులు ఆవేదన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.