Weatehr Report : ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశారుగా...వాతావరణ శాఖ కీలక అప్ డేట్

సంక్రాంతి పండగ వచ్చేసింది. భోగి పండగ నాటికి చలి తీవ్రత తగ్గింది

Update: 2026-01-15 04:33 GMT

సంక్రాంతి పండగ వచ్చేసింది. భోగి పండగ నాటికి చలి తీవ్రత తగ్గింది. వాతావరణ శాఖ అంచనాల మేరకు ఇక చలి తీవత్ర మరింత తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాలను చలి పులి చంపేసింది. బయటకు రావాలంటేనే జనం భయపడిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే భోగి నాటి నుంచి చలి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. వాయుగుండం ప్రభావంతో అక్కడ కక్కడ ఏపీలో వానలు కురుస్తున్నా ఉష్ణోగ్రతలు కొంత పెరిగినట్లే కనిపిస్తుంది.

ఏపీలో ఉష్ణోగ్రతలిలా...
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండగ వేళ చలి తీవ్రత చాలా వరకూ తగ్గింది. నిన్న మొన్నటి వరకూ చలిగాలులతో జనం అల్లాడిపోయారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ, సాయంత్రం ఐదు గంటల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడే వారు. కానీ నిన్నటి నుంచి కొంత చలితీవ్రత తగ్గింది. సహజంగా శివరాత్రికిచలి తగ్గుతుందని అంటారు. కానీ ఈసారి ముందుగానే చలి తీవ్రత తగ్గింది. కొంత ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మొన్నటి కంటే నిన్న.. నిన్నటి కంటే నేడు కొంత ఉష్ణోగ్రతలు పెరిగాయంటున్నారు. కనీసం రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
డబుల్ డిజిట్ కు మారి...
తెలంగాణలోనూ చలి తీవ్రత తగ్గింది. నిన్నటి వరకూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయిన ప్రాంతాల్లోనూ డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్నటి వరకూ చలితీవ్రత ఎక్కువగా ఉన్నఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక ఫ్యాన్లు వేసుకోవడం జనం ప్రారంభించారు. ఉక్కపోత మొదలయింది.


Tags:    

Similar News