Telangana : సంక్రాంతికి ఊరెళ్లి .. హైదరాబాద్ వస్తున్నారా? ఈ మార్గం నుంచి రావాల్సిందే
సంక్రాంతి పండగకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ కు చేరుకునేందుకు సమయం దగ్గర పడింది
సంక్రాంతి పండగకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ కు చేరుకునేందుకు సమయం దగ్గర పడింది. రేపటి నుంచి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఈ పరిస్థితుల్లో జాతీయ రహదారిపైసంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలకు దారి మళ్లిస్తూ నల్లగొండి జిల్లా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకే సారి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు చేరుకోనున్నాయి. మొత్తం మూడు లక్షలకు పైగా వాహనాలు తిరిగి రానున్నాయి.
ట్రాఫిక్ రద్దీతో...
ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై మరొకసారి ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో హైద్రాబాద్- విజయవాడ జాతీయ రహదారి పై చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా మరియు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సాఫీ ప్రయాణం కల్పించాలనే ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చెపట్టారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు క్రింద సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని నల్లగొండ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.