గవర్నర్ వద్దకు చంద్రబాబు

చంద్రబాబు ఏపీ గవర్నర్ ను కలిశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. శాసనమండలిలో వైసీపీ చేసిన దౌర్జన్యాలను గవర్నర్ కు [more]

Update: 2020-01-24 11:02 GMT

చంద్రబాబు ఏపీ గవర్నర్ ను కలిశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. శాసనమండలిలో వైసీపీ చేసిన దౌర్జన్యాలను గవర్నర్ కు చంద్రబాబు వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా గవర్నర్ కు అందజేశారు. తమ ఎమ్మెల్సీలు హీరోలని చంద్రబాబు ప్రశంసించారు. వైసీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ ఎమ్మెల్సీలు లొంగలేదన్నారు. వారు ప్రజల కోసం నిలబడ్డారని చంద్రబాబు కొనియాడారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News