Weather Report : సమ్మర్ స్టార్టయినట్లేనా.. వాతావరణ శాఖ కీలక అప్ డేట్
చలితీవ్రత దాదాపుగా తగ్గిపోయింది
చలితీవ్రత దాదాపుగా తగ్గిపోయింది. గత రెండు నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలను చలి ఊపేసింది. ఒక విధంగా చెప్పాలంటే గడ్డకట్టుకుని పోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ చలితీవ్రత కారణంగా అనేక మంది ప్రజలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలగాణలలో మరో రెండు రోజుల పాటు చలితీవ్రత గతంలో కంటే ఎక్కువగా నమోదయిందని, అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదయ్యాయయని వాతావరణ శాఖ చెబుతుంది. పొగమంచు కూడా చాలా రోజులు ఇబ్బంది పెట్టింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులను ఇబ్బందులు పెట్టడంతో వాహనాలు లైట్లు వేసుకుని మరీ రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏపీలోనూ పూర్తిగా తగ్గి...
ఇక ఆంధ్రప్రదేశ్ లో చలితీవ్రత గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువగా కనిపించిది. ప్రధానంగా ల్లూరి పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా కనిపించింది.దట్టంగా అలుముకున్న పొగమంచును ఎంజాయ్ చేయడానికి అనేక మంది పర్యాటకులు వరుస హాలిడేస్ కావడంతో పర్యాటక ప్రాంతాలకు వచ్చారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, అరకు, లంబసింగి, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో పర్యాటకులు ఫుల్ గా నిండిపోయిన పరిస్థితి నెలకొంది. మినుములూరులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అయితే ఇప్పుడు డబుల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. నిన్నటి వరకూ సాయంత్రం ఐదు గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే జనం బయటకు వస్తున్నారు.
క్రమంగా ఉష్ణోగ్రతలు...
తెలంగాణలోనూ చలితీవ్రత గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదయింది. దాదాపు రెండు దశాబ్దాలుగా స్వెట్టర్లు వినియోగించని వారు సయితం ఈ సీజన్ లో స్వెట్టర్లు, మంకీ క్యాప్ లు ధరించి మాత్రమే బయటకు రావాల్సి వచ్చింది. అయితే వాతావరణ శాఖ మరికొద్ది రోజులు చలి తీవ్రత ఉంటుందని చెప్పినప్పటికీ దాదాపు ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరాయి. ప్రస్తుతం ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం మీద తెలంగాణ కూడా చలి తీవ్రత నుంచి బయటపడినట్లే. ఇక వేసవి ప్రారంభమయిందనట్లువాతావరణం ఉంది.