విజయసాయి అల్లుడు చెప్పినట్లే చెత్త రాసిచ్చారు

విజయసాయి రెడ్డి అల్లుడు ఇచ్చిన రిపోర్టు పట్టుకుని బీసీజీ అంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జీఎన్ రావు కమిటీ కూడా అజయ్ కల్లాం చెప్పినట్లే చేశారని [more]

Update: 2020-01-04 08:15 GMT

విజయసాయి రెడ్డి అల్లుడు ఇచ్చిన రిపోర్టు పట్టుకుని బీసీజీ అంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జీఎన్ రావు కమిటీ కూడా అజయ్ కల్లాం చెప్పినట్లే చేశారని ఆయనే ఒప్పుకున్నారని చంద్రబాబు అన్నారు. బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు లో విజయసాయి రెడ్డి అల్లుడు స్నేహితుడు డైరెక్టర్ గా ఉన్నారన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపుతో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. ఆయన చెప్పినట్లే రిపోర్టును తయారు చేశారని చంద్రబాబు అన్నారు. క్లయింట్ కు ఏది కావాలో అది కన్సల్టెన్సీ ఇస్తుందన్నారు. బీసీీజీ చేత నివేదిక తెప్పించుకునే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు చంద్రబాబు. అసలు ఆ రిపోర్టును ఎవరు పట్టించుకుంటారన్నారు. ఇది ఒక రిపోర్టా? అని చంద్రబాబు అన్నారు. బీసీజీకి తలా? తోకా? ఉందా? అని నిలదీశారు. బీసీజీ నివేదికకు విశ్వసనీయత ఉందా? అన్నారరు. ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజధాని రైతు గుండెపోటుతో చనిపోవడం బాధాకరమన్నారు. నారాయణ కమిటీ మీద ఇష్టం వచ్చినట్లు రబ్బిష్ గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News