బ్రేకింగ్ : చంద్రబాబుతో సహా అందరూ అరెస్ట్
విజయవాడలో బెంజిసర్కిల్ లో బైఠాయించిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంజిసర్కిల్ వద్ద బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు [more]
విజయవాడలో బెంజిసర్కిల్ లో బైఠాయించిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంజిసర్కిల్ వద్ద బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు [more]
విజయవాడలో బెంజిసర్కిల్ లో బైఠాయించిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంజిసర్కిల్ వద్ద బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు చంద్రబాబుకు నచ్చజెప్పేందుకు దాదాపు గంటన్నరపాటు ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తిందని, తమకు సహకరించాలని పోలీసులు కోరారు. అయినా వినకపోవడంతో చంద్రబాబుతో పాటు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో చంద్రబాబును బెంజిసర్కిల్ నుంచి తరలించారు. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.