పెరుగుతున్న బియ్యం ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం!

కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో వాటి ధరలను ..

Update: 2023-08-28 07:51 GMT

కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో వాటి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. ఇప్పుడు బియ్యం ధరలపై కూడా నిఘా పెట్టింది. ధరల నియంత్రణపై ప్రత్యేక చర్యలకు పూనుకొంది. అన్నిరకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పెరుగుతున్న ఈ నిషేధాజ్ఞ‌లు ఆగస్టు 27 నుంచే అమల్లోకి తీసుకువస్తున్నట్లు నోటిఫికేషన్‌లో కేంద్రం వెల్లడించింది. టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలు అవుతుందని కేంద్రం తెలిపింది. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని కూడా కేంద్రం వెల్లడించింది.

కాగా, ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది కేంద్రం. ఈ నిషేధం అమలు అక్టోబర్ 16 వరకు అమల్లో ఉండనుందని పేర్కొంది. ఈ ఏడాది పలు రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం, ఆంక్షలు విధించి కేంద్రం ప్రభుత్వం. గత సంవత్సరం 74 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం విదేశాలకు ఎగుమతి జరిగింది. దేశీయంగా ఉప్పుడు బియ్యం ధర రికార్డు స్థాయికి పెరిగిపోవడంతో.. దేశీయంగా అవసరాలకు సరిపడా బియ్యం స్టాక్ నిర్వహణ కోసం ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్ ప్రభుత్వం.

విదేశాలకు ఉప్పుడు బియ్యం ఎగుమతిపై కేంద్రం సుంకం విధించడంతో పాకిస్థాన్, థాయిలాండ్ దేశాల్లో బియ్యం ధరలు ఎగబాకాయి. విదేశీ వ్యాపారులు సైతం ఇతర దేశాల నుంచి చౌకగా బియ్యం దిగుమతి చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40 శాతానికి పై చిలుకే ఉంది.

గత నెలలో బాస్మతియేతర బియ్యంపై నిషేధం:

గత నెలలో బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. దేశీయంగా బియ్యం సరఫరా పెంపుదలకు, ధరల నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నది. బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు 12 ఏండ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి వ్యవసాయం, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA), నియంత్రణ సంస్థకు ఆగస్టు 26న ఒక లేఖ రాసింది. దీంతో భారతదేశం ఎగుమతి ఆదాయాన్ని తగ్గించగల బాస్మతి ఎగుమతులపై ఈ నిషేధం, ఆంక్షలు విధించింది.

Tags:    

Similar News