హాట్ స్పాట్ జిల్లాలివే..ఏపీలో 11, తెలంగాణలో 8, కేంద్రం ప్రకటన
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్ గా గుర్తించింది. ఇక్కడ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో ఎనిమిది జిల్లాలను [more]
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్ గా గుర్తించింది. ఇక్కడ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో ఎనిమిది జిల్లాలను [more]
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్ గా గుర్తించింది. ఇక్కడ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో ఎనిమిది జిల్లాలను హాట్ స్పాట్ జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, మెదక్, నిర్మల్, మేడ్చల్, గద్వాల్, కరీంనగర్ జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణాలో హాట్ స్పాట్ క్లస్టర్ గా నల్లగొండ జిల్లాను గుర్తించింది. ఈ జిల్లాలకు ఏప్రిల్ 20వ తేదీ తర్వాత కూడా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను అమలుపర్చాలని కోరింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో పదకొండు జిల్లాలను హాట్ స్పాట్ లుగా గుర్తించింది. కరోనా వైరస్ ఒక్క కేసు కూడా లేని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహాయించి మిగిలిన అన్ని జిల్లాలను హాట్ స్పాట్ లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.