వైసీపీ ఎమ్మెల్యే దారి తప్పారు
వైసీపీ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. లాక్ డౌన్ సమయంలో ఏపీ కర్ణాటక సరిహద్దుల్లోకి ఐదు కార్లతో తన అనుచరులతో ఎమ్మెల్యే [more]
వైసీపీ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. లాక్ డౌన్ సమయంలో ఏపీ కర్ణాటక సరిహద్దుల్లోకి ఐదు కార్లతో తన అనుచరులతో ఎమ్మెల్యే [more]
వైసీపీ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. లాక్ డౌన్ సమయంలో ఏపీ కర్ణాటక సరిహద్దుల్లోకి ఐదు కార్లతో తన అనుచరులతో ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ చేరుకున్నారు. చీకల బయలు చెక్ పోస్టు వద్ద ఎమ్మెల్యేను ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఆయన అనచరులు, బంధువులు మొత్తం 39 మంది ఉండటంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో మధుసూదన్ యాదవ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు సీరియస్ గా చెప్పడంతో ఎమ్మెల్యే తిరుపతి వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా బొర్రా మధుసూదన్ యాదవ్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.