ముగింపు ఎవరికో తెలుస్తుంది

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వథ్థామ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదని అశ్వథ్తామ రెడ్డి అన్నారు. కార్మికులను అవమానపర్చేలా [more]

Update: 2019-10-24 12:55 GMT

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వథ్థామ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదని అశ్వథ్తామ రెడ్డి అన్నారు. కార్మికులను అవమానపర్చేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కేసీఆర్ మాట ఇచ్చినట్లుగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీకి, యూనియన్లకు ముగంపు ఉండదని, ముగింపు ఎవరికో ప్రజలే నిర్ణయిస్తారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. కేసీఆర్ దురహంకారానికి ఈ మీడియా సమావేశం నిదర్శనమన్నారు. ఆర్టీసీ ఎవరి సొత్తు కాదన్నారు. ఈ ఆర్టీసీ కార్మికులే కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేశారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకూ ఆర్టీసీ ఉంటుందన్నారు.

Tags:    

Similar News