Gold Prices Today : బంగారం ముట్టుకుంటే షాక్... వెండి అంటుకుంటే అంతే

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి

Update: 2026-01-30 03:42 GMT

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా ఇక పరుగు ఆపడం లేదు. ఇప్పటికే దేశంలో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షల రూపాయలకు చేరువలో ఉంది. కిలో వెండి ధర నాలుగు లక్షల రూపాయలు దాటేసింది. ఇక ఈ ఏడాదిలో ధరలు ఏ రేంజ్ లో వెళతాయన్నది ఎవరూ ఊహించడం కష్టమే. ఎందుకంటే గత పథ్నాలుగు నెలలుగా బంగారం, వెండి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలు చేయడానికి కూడా కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ పరుగు ఎటు తీసుకెళుతుందన్నది మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంది. మరొకవైపు పసిడి ధరలు పతనమవుతాయన్న ప్రచారం మాత్రం వినియోగదారుల్లో ఆశలు రేకెత్తిస్తుంది.

బంగారం షాపులు వెలవెల...
ఇప్పటికే దేశంలో జ్యుయలరీ దుకాణాలు వినియోగదారులు లేక వెలవెల బోతున్నాయి. కేవలం విండో షాపింగ్ కు వచ్చే వారు తప్పించి కొనుగోలు చేసే వారు కనిపించడం లేదు. 2024లో బంగారం, వెండి ధరల అమ్మకాలు జోరుగా సాగేవి. అందులో కనీసం పది శాతం కూడా ఇప్పుడు లేవని దుకాణాల యజమానులు వాపోతున్నారు. అనేక కారణాలతో ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రజలకు కొనుగోలు చేసే శక్తి లేనప్పుడు ధరలు ఎంత పెరిగినా తమ దుకాణాలకు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. అప్పటికీ అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ.. ఆఫర్లు పసిడి ప్రియులను ఆకట్టుకోవడం లేదు. అందుకే బంగారానికి దూరంగా అనేక వర్గాలు ఉండిపోతున్నాయి.
మదుపు చేసేందుకు...
ఇక పెట్టుబడి పెట్టేవారు కూడా బంగారం, వెండిపై మదుపు చేసేందుకు ఒకింత భయపడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ లోనూ అమ్మకాలు తగ్గడంపై జ్యుయలరీ దుకాణాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పన్నెండు వేలు పెరిగింది. కిలో వెండి ధరపై ముప్ఫయి వేలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,63,960 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,78,886 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 4.25,100 రూపాయలుగా నమోదయింది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరిగే అవకాశముంది.
Tags:    

Similar News