కరోనా కష్టకాలంలోనూ నేటి నుంచి ఏపీలో?

కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ ను నేడు రెండో విడత పంపిణీ చేయనుంది. తొలి విడత బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఇచ్చిన [more]

Update: 2020-04-15 02:55 GMT

కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ ను నేడు రెండో విడత పంపిణీ చేయనుంది. తొలి విడత బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఇచ్చిన ప్రభుత్వం రెండో విడతలో ఉచితంగా ఐదు కేజీల బియ్యంతో పాటు కేజీ శనగలను పేదలకు ఇవ్వనుంది. అయితే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా రేషన్ దుకాణాల వద్దకు రావాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు 14 వేల రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి కూపన్లు అందించారు. కూపన్లలో ఇచ్చిన తేదీల్లో మాత్రమే రేషన్ అందుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News