అందుకే కేసులు పెరుగుతున్నాయట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఏపీలో 75 కేసులు అత్యధికంగా నమోదు కావడంపై తొలుత [more]

Update: 2020-04-21 02:33 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఏపీలో 75 కేసులు అత్యధికంగా నమోదు కావడంపై తొలుత ఆందోళన వ్యక్తమయింది. అయితే అధికారుల సమీక్షల్లో తాము గతంలో కంటే ఎక్కువ టెస్ట్ లను నిర్వహిస్తున్నందున సహజంగానే కేసుల సంఖ్య పెరుగుతుందని వివరించారు. నిన్న ఒక్క చిత్తూరు జిల్లాలోనే 25 కేసులు నమోదయ్యాయి. అందులో శ్రీకాళహస్తిలోనే 13 కేసులు నమోదయ్యాయి. దీంతో రెడ్ జోన్లలో నిబంధనలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.

Tags:    

Similar News