ఏసీబీ డీజీ బదిలీ

అవినీతి నిరోధకశాఖ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్ ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విశ్వజిత్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ [more]

Update: 2020-01-04 13:02 GMT

అవినీతి నిరోధకశాఖ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్ ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విశ్వజిత్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆయన స్థానంలో రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ పి.సీతారామాంజనేయులుకు అదనపు బాద్యతలు అప్పగించారు. అలాగే రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల క్రితమే జగన్ ఏసీబీపై సమీక్ష నిర్వహించారు. ఏసీబీ పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలరోజుల సమయం కూడా ఇచ్చారు. అయితే నెల రోజుల సమయం ఇచ్చినా విశ్వజిత్ ను బదిలీ చేయడం అధికారుల్లో చర్చనీయాంశమయింది.

Tags:    

Similar News