జగన్ పై మరో అధికారి గవర్నర్ కు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరో అధికారి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏపీపీఎస్సీసీ ఛైర్మన్ ఉదయభాస్కర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. [more]

Update: 2020-03-21 01:47 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరో అధికారి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏపీపీఎస్సీసీ ఛైర్మన్ ఉదయభాస్కర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. తనను గత ప్రభుత్వం ఈ పదవిలో నియమించిందని కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. తన ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తాను తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ సెక్రటరీ ద్వారానే జరుపుతున్నారని చెప్పారు. గత ఆరు నెలలుగా తనను మానసిక క్షోభ పెడుతున్నారని గవర్నర్ కు ఆయన వివరించారు. మెంబర్ రంగరాజన్ ను ఇన్ ఛార్జిగా నియమించి తనను అవమానపాలు చేస్తున్నారని చెప్పారు. మొత్తం మూడు పేజీల లేఖతో ఉదయ భాస్కర్ గవర్నర్ కు జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News