కీలక కేసులో రేవంత్ రెడ్డి… ఇరుక్కుంటారా?

కీసర తాహసిల్దార్ లంచం కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చుట్టూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డికి సంబంధించిన లెటర్ హెడ్స్ లభ్యమయినట్లు తెలుస్తోంది. [more]

Update: 2020-08-19 07:52 GMT

కీసర తాహసిల్దార్ లంచం కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చుట్టూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డికి సంబంధించిన లెటర్ హెడ్స్ లభ్యమయినట్లు తెలుస్తోంది. కీసర ఎమ్మార్వో నాగరాజు ఒక ల్యాంగ్ సెటిల్ మెంట్ లో 1.24 కోట్ల రూపాయలను లంచంగా తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజుతో పాటు, అంజిరెడ్డి మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అంజిరెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఇంత పెద్దమొత్తంలో నగదు లభ్యమవ్వడం వెనక కూడా అనుమానాలున్నాయి. ఈ నలుగురిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ కోర్టులో ఏసీబీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. అంజిరెడ్డిని విచారిస్తే రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాలు బయటపడతాయంటున్నారు.

Tags:    

Similar News

.