నాడు మోకాళ్లడ్డి... నేడు మౌనంగా నిలబడి..!

మన దేశం 75 సంవత్సరాల ప్రజాస్వామ్య మహోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించబోవడం ఒక శుభ పరిణామం 1996లో ప్రారంభమైన ఈ ఘట్టం నేటికి సంపూర్ణం కానుంది. మనదేశంలో మొదటి నుంచి మహిళలు అంటే చిన్న చూపే. సతి సహగమనం, బాల్యవివాహాలు, వరకట్నం... ఇవన్నీ మహిళలపై వివక్షకు సాక్ష్యాలు. ఎన్నో అణచివేతలు, పోరాటాల తర్వాతే ఈరోజు భారత మహిళ... ఈ మాత్రం దూరం ప్రయాణించగలిగింది.

Update: 2023-09-19 06:45 GMT

మన దేశం 75 సంవత్సరాల ప్రజాస్వామ్య మహోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించబోవడం ఒక శుభ పరిణామం 1996లో ప్రారంభమైన ఈ ఘట్టం నేటికి  సంపూర్ణం కానుంది. మనదేశంలో మొదటి నుంచి మహిళలు అంటే చిన్న చూపే. సతి సహగమనం, బాల్యవివాహాలు, వరకట్నం... ఇవన్నీ మహిళలపై వివక్షకు సాక్ష్యాలు. ఎన్నో అణచివేతలు, పోరాటాల  తర్వాతే ఈరోజు భారత మహిళ... ఈ మాత్రం దూరం ప్రయాణించగలిగింది.  ఈ  నేపథ్యంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ మహిళల చిరకాల కోరిక గానే మిగిలింది. 

దాదాపు పాతికేళ్లుగా నాటి ప్రభుత్వాలు చట్ట సభల్లో మహిళా కోటాకు ప్రయత్నించాయి. కానీ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లు చట్టరూపం దాల్చకుండా మోకాలడ్డాయి.  వాటిలో ములాయం సింగ్ యాదవ్ లోక్ తాంత్రిక్ మంచ్ (నేటి సమాజ్ వాది పార్టీ)  లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్, నితీష్ కుమార్ యాదవ్ జనతాదళ్ కూడా ఉన్నాయి ఆ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతిసారి వాళ్ళు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. మహిళలకు అవకాశాలు అక్కర్లేదని ఆ పార్టీల ఉద్దేశం కాబోలు. గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపీఏ 'మహిళా బిల్లు' ఆమోదానికి ప్రయత్నించినా... మెజారిటీ లేకపోవడం, కాంగ్రెస్ కూడా బిల్లుకు పూర్తిగా మద్దతు తెలిపే వైఖరి ప్రదర్శించకపోవడంతో ఆ బిల్లు చట్ట రూపం దాల్చలేదు. కానీ మోదీ షా ద్వయం దశాబ్దాల మహిళల కలలు సాకారం చేస్తోంది. నాడు మహిళా బిల్లుకు మోకాలడ్డిన పార్టీలన్నీ ఈరోజు మౌనంగా తలవంచుతూ,  మహిలా సాధికారతకి దారి ఇస్తున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం గొప్ప విషయం. ఇది మహిళలకే కాదు ఈ దేశంలో ఉన్న పురుషులకు కూడా గర్వకారణం.

Tags:    

Similar News