తెలంగాణలో 700 కరోనా పాజిటివ్ కేసులు.. ఈ ఒక్కరోజే యాభై
కరోనా పాజిటివ్ సంఖ్యలతో భయపడాల్సిన పనిలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన ఆరు మంది 81 మందికి కరోనా [more]
కరోనా పాజిటివ్ సంఖ్యలతో భయపడాల్సిన పనిలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన ఆరు మంది 81 మందికి కరోనా [more]
కరోనా పాజిటివ్ సంఖ్యలతో భయపడాల్సిన పనిలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన ఆరు మంది 81 మందికి కరోనా వైరస్ ను తగిలించారని చెప్పారు. అందుకే మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారు ప్రభుత్వానికి తెలియచేయాలని ఈటల రాజేందర్ కోరారు. పదిహేను వందల పడకలతో గచ్చి బౌలి స్టేడియంలో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈనెల 20వ తేదీన దానిని ప్రారంభించ నున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఈ ఒక్కరోజే యాభై కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700 కు చేరుకుందన్నారు.