కొడంగల్ లో వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండి పడ్డారు. కొడంగల్ లో అంబేద్కర్ సర్కిల్ లో ఆమె ప్రసంగించారు.

Update: 2022-08-09 13:12 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండి పడ్డారు. కొడంగల్ టౌన్ లో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆమె ప్రసంగించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డి కూడా పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లే ముఖ్యమంత్రి గా ఉన్నారని, కానీ ఐదేళ్లలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించారన్నారు. రైతులకు రుణమాఫీ చేసి వారికి అండగా నిలిచారన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. కేసీఆర్ చెపింది, చేస్తున్నదీ ప్రతిదీ మోసమేనని షర్మిల ఫైర్ అయ్యారు.

రేవంత్ మొహం....
వలస జిల్లాగా ఉన్న పాలమూరు ప్రజల కోసం నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయలి్ సాగర్ ప్రాజెక్టులకు పునాదులను వైఎస్ వేశారన్నారు. 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులను కూడా కేసీఆర్ 10 శాతం పనులను ఎనిమిదేళ్లలో చేయలేకపోయారన్నారు. కేసీఆర్ కు పాలమూరు జిల్లాపై ప్రేమ లేదని అననారు. ప్రాజెక్టు రీ డిజైన్ ల పేరుతో వేల కోట్లు దోచుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మొహం కొడంగల్ లో చెల్లలేదని, రాష్ట్రం మొత్తం చెల్లుతుందా అని షర్మిల ప్రశ్నించారు.


Tags:    

Similar News