మునుగోడు ఉప ఎన్నికల్లో వైసీఆర్టీపీ

వైఎస్సార్టీపీ మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Update: 2022-08-25 03:19 GMT

వైఎస్సార్టీపీ మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టేందుకు అంగీకరించారు. అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. కొందరు పేర్లను తెప్పించుకుని షర్మిల పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

పార్టీ పెట్టిన తర్వాత....
వైఎస్సార్టీపీ స్థాపించిన తర్వాత ఇప్పటి వరకూ జరిగిన ఉప ఎన్నికలకు ఆ పార్టీ దూరంగా ఉంది. ఒకేసారి సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. కానీ కార్యకర్తల ఒత్తిడి మేరకు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారని తెలియ వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసం నలుగురి పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది.


Tags:    

Similar News