ఆ జిల్లాల్లోని మందు బాబులకు బ్యాడ్ న్యూస్

మే 27వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు

Update: 2024-05-24 11:06 GMT

మే 27వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రులు ఓటు వేయనున్నారు. ఎన్నికల పోలింగ్‌ జరిగే మూడు జిల్లాలలో వైన్‌ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్‌ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మే 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు, బార్‌లు మూసి వేయనున్నారు.

పోలింగ్ రోజు మే 27వ తేదీన‌ సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే పోలింగ్ జరిగే జిల్లాల్లో మాత్రమే హాలిడే ఇచ్చే అవకాశం ఉంది. ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మే 27న జరుగనుంది. ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఉంది. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్‌ 5న కౌంటింగ్‌ చేపట్టనున్నారు.


Tags:    

Similar News