తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎరువుల ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎరువుల ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజుబిలిటీ కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే అదే సమయంలో ప్రభుత్వం ముందుకు వస్తే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తుందని చెప్పారు. ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ప్రారంభిస్తారని కూడా కిషన్ రెడ్డి తెలిపారు.
జాతీయ రహదారులు.....
అలాగే తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవని, ఈ ఏడేళ్లలో 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రధాని అయిన తర్వాత తెలంగాణలో 75 రోడ్ల నిర్మాణం పూర్తయిందని, ఇందుకు 31,664 కోట్లు ఖర్చయ్యాయని వివరించారు.