షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం నెలకొని ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు

Update: 2022-11-25 12:31 GMT

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం నెలకొని ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. కల్వకుంట్ల కుటుంబం డబ్బులు సంపాదించుకోవడం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తాము తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేరిక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బీజేపీకి అండగా...
ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితేనే బీజేపీకి మరింత లాభం చేకూరుతుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీకి అండగా నిలబడాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలంటే బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు.


Tags:    

Similar News