కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు

Update: 2022-01-01 08:09 GMT

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు భూమిని ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. భూమిని కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు విడుదల చేయించేలా ప్రయత్నం చేస్తానని కిషన్ రెడ్డి కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు....
అలాగే హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. త్వరగా భూసేకరణ జరిపితే పనులు ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. తన లేఖకు కేసీఆర్ స్పందిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉందన్నారు.


Tags:    

Similar News