ఎంఐఎంను బలోపేతం చేసేందుకే?

ప్రధాని అయినట్లు కేసీఆర్ కలలు కంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2022-10-03 07:11 GMT

ప్రధాని అయినట్లు కేసీఆర్ కలలు కంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎంఐఎంను బలోపేతం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు కలసి విమానం కొనుగోలు చేశాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కనుమరుగు కాక తప్పదన్న సంకేతాలతోనే జాతీయ పార్టీ పెడుతున్నారని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీ అంటూ కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరతీసిందన్నారు. అందరు నేతల వద్దకు వెళ్లి భంగపడిన కేసీఆర్ ఎంఐఎం ఆదేశంతో ఈ పార్టీని పెడుతున్నారన్నారు.

ప్రజల్లో వ్యతిరేకత...
టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో కేసీఆర్ కు ఏ పార్టీ కూడా కలసి రావడం లేదన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ నినాదాన్ని అందుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందన్నారు. దేశం సంగతి దేముడెరుగు, ముందు తెలంగాణలో ఆయన అధికారంలోకి రావాలని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబానికి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.


Tags:    

Similar News