కేసీఆర్ విలువలను వదిలేశారు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలన్నారు. ప్రధానిని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కేసీఆర్ కు తగదని కిషన్ రెడ్డి హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంపై దిగజారిన భాషను గత కొంతకాలంగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాతనే కేసీఆర్ లో ఈ మార్పు కన్పిస్తుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తప్పుడు ప్రచారం చేస్తూ...
బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలనడం అవివేకమని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అవమానకరంగా మాట్లాడటం తగదని అన్నారు. కేసీఆర్ రాజకీయ విలువలకు, నైతిక విలువలను వదిలేశారని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలన్నింటిని అమలు పర్చారా? అని ఆయన ప్రశ్నిచారు. నలుగురిని ఆకట్టుకుని మాట్లాడినంత మాత్రాన అబద్దాలు నిజాలు అయిపోవన్నారు.