కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.

Update: 2022-03-01 12:10 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పేద విద్యార్థులకు లబ్ది చేకూర్చే పోస్ట్ మెట్రిక్ ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌‌షిప్ లపై దృష్టిసారించాలని లేఖలో కోరారు. గత విద్యా సంవత్సరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కలిపి విడుదల చేయాల్సిన స్కాలర్‌షిప్ లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో స్కాలర్‌షిప్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వెంటనే పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ కు రాసిన లేఖలో కోరారు.

స్కాలర్‌షిప్ ల కోసం....
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను పునరుద్ధరించేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. స్కాలర్ షిప్ లు వెంటనే విద్యార్థుల ఖతాల్లో జమ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని చెప్పారు. ఈ స్కాలర్ షిప్ వాటాలో కేంద్ర ప్రభుత్వం తన వాటా 12 శాతం నుంచి 60 శాతానికి పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్ షిప్ ల మంజూరులో జాప్యం చేస్తుందని, వెంటనే స్కాలర్ షిప్ ల నిధులను విడుదల చేయాలని కిషన్ రెడ్డి తన లేఖలో కోరారు.


Tags:    

Similar News