వారికి కిషన్ రెడ్డి వార్నింగ్

రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-10-02 08:37 GMT

ిరాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలోకి వచ్చిన ఇంటలిజెన్స్ అధికారులపై ఆయన మండిపడ్డారు. మరోసారి ఆఫీసులోకి వస్తే ఊరుకునేది లేదని మంత్రి కిషన్ రెడ్డి ఇంటలిజెన్స్ అధికారులను హెచ్చరించారు. అనుమతి లేకుండా కార్యాలయంలోకి ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు.

అలాగయితే...?
ఫోన్లు ట్యాప్ చేస్తున్నది చాలదా? ఇంకా ఆఫీసులోకి వచ్చి ఏం సమాచారాన్ని సేకరించాలని కిషన్ రెడ్డి ఇంటలిజెన్స్ అధికారులపై ఫైర్ అయ్యారు. అలాగయితే తాము ప్రగతిభవన్, తెలంగాణ భవన్ లో ఐబీ అధికారులను పెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకరిస్తారా? అని నిలదీశారు.


Tags:    

Similar News