Bandi Sanjay : మాటల్లేవ్... మాట్లాడుకోటాల్లేవ్...క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని బండి సంజయ్ తెలిపారు. తుపాకులతో అమాయకులను చంపినవారితో చర్చలు ఉండవని తేల్చి చెప్పార మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ అని, మావోయిస్టులు మందుపాతరలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారని, తుపాకీ వీడనంత వరకు చర్చల ఊసే ఉండదని బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి హోదాలో క్లారిటీ ఇచ్చారు.
రెండు పార్టీలూ ఒక్కటే...
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనన్న బండి సంజయ్ మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. మావోయిస్టులతో మాటల్లేవు..మాట్లాడుకోవడాల్లేవు అంటూ గట్టిగా బండి సంజయ్ బదులిచ్చారు. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకమన్న బండి సంజయ్ పాస్‌పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపుతున్నామని తెలిపారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.