Kishan Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-11-06 07:18 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వస్తున్న సర్వేల్లో వాస్తవం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు ఇంకా ఎవరికి ఓటు వేయాలన్నది నిర్ణయించుకోలేదన్న కిషన్ రెడ్డి ఈలోపు సర్వేలు చేస్తే వచ్చే ఫలితాలు వాస్తవానికి దూరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అందుకే సర్వేల్లో స్పష్టత లేకుండా పోయిందన్నారు. అభివృద్ధిలో జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురయిందని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనకబడటానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లే కారణమని కిషన్ రెడ్డి తెలిపారు.

సర్వేలలో స్పష్టత లేకుండా...
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో వ్యక్తిగత విమర్వలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఆర్ఆర్ఆర్ మొదటి ఫేజ్ కోసం 16,520 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. సన్నబియ్యం వాటాలో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఓటర్లు విజ్ఞతతో ఓటు వేసి సరైన అభ్యర్థిని గెలిపించుకుంటారని అన్నారు. ఈ నెల 14వ తేదీన ఎవరు గెలుస్తారన్నది తెలుస్తుందని, సర్వేల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.


Tags:    

Similar News