రక్తం కాదు.. కిడ్నీ ఇస్తా...బండికి కేటీఆర్ సవాల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు

Update: 2022-12-20 12:19 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. బండి సంజయ్ మనిషా? పశువా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నాడని, దమ్ముంటే ఇక్కడకు డాక్టర్ కు తీసుకురావాలని, తన కిడ్నీ, రక్తం, వెంట్రుకలను కూడా ఇస్తానని ఆయన అన్నారు. తాను క్లీన్ చిట్ తో బయటపడితే కరీంనగర్ కమాన్ వద్ద చెప్పుతో కొట్టుకుంటావా? అని సవాల్ విసిరారు.

వాడి పిండాకూడు...
"వాడి పిండాకూడు.. ఏం రాజకీయమయ్యా ఇది. అసలు కరీంనగర్ కు నువ్వు ఏం చేశావురా భయ్" అంటూ కేటీఆర్ మండి పడ్డారు. గావుకేకలు, పెడబొబ్బలు పెట్టడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొనాలని, అంతే తప్ప అబద్ధ ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయాలనుకుంటే అది కుదరదని కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ కు అసలు తెలివి ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ కు ఏం చేశావో చెప్పమంటే చెప్పడని, మతం పేరుతో రాజకీయాలు చేయడమొక్కటే తెలుసునని అన్నారు. హిందూ ధర్మం పాటించేవాడివైతే ఏ ఆలయానికైనా పైసా నిధులు ఇచ్చావా? అని నిలదీశారు.


Tags:    

Similar News