ములుగు జిల్లాలో విషాదం... కోతుల కోసం విషాహారం పెట్టి...?
ములుగు జిల్లాలో విషాదం నెలకొంది
ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. గోవిందరావుపేటలోని ఎన్టీఆర్ కాలనీలో బాలుడు మరణించాడు. కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి కుటుంబం విషాహారం పెట్టి ఉంచింది పొరపాటున విషాహారం తిన్న నాలుగేళ్ల బాలుడు అశ్విన్ నందన్ మరణించాడు.
బాలుడు మృతి చెందడంతో...
వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోతుల కోసం విషాహారం పెట్టిన దంపతులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.