Hot Summer : అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి.. పది రోజులు హై అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలెర్ట్ జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలెర్ట్ జారీ చేసింది. రానున్న పది రోజుల పాటు బయటకు రావద్దని సూచించింది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, నలభై నాలుగు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. పది రోజుల పాటు ఇంటిపట్టునే ఉండటం ఉత్తమమని చెప్పింది. అంతే తప్ప అనవసర ప్రయాణాలను, దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరమని వాతావరణ శాఖ అధికారులు అలెర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రమే బయటకు రావాలని చెప్పింది.
వేడి గాలుల ఉధృతి...
ఆంధ్రప్రదేశ్ లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలుల ఉధృతి కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పింది. ఏపీలోని దాదాపు ఇరవైకి పైగా మండలాల్లో వేడిగాలులుల తీవ్రంగా వీచే అవకాశముందని చెప్పింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. 45 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రాకపోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నార.
తెలంగాణలోనూ అత్యధికంగా...
తెలంగాణలోనూ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22 వతేదీ వరకూ ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగానే ఈ పది రోజుల పాటు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రయివేటు వాహనాల కంటే హైదరాబాద్ వంటి నగరంలో మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.