KTR : బీఆర్ఎస్ కాదు.. మళ్లీ టీఆర్ఎస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలనుకుంటున్నామని చెప్పారు. పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిన తర్వాత రాజకీయంగా చాలా నష్టపోయాం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
బీజేపీతో పొత్తుపై...
అందుకే తిరిగి పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చాలని నిర్ణయించామని, కేసీఆర్ దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తారని చెప్పారు. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదన్న కేటీఆర్.. ఏ నియోజకవర్గం నుంచైనా తాను పోటీకి సిద్ధమని సవాల్ విసిరారు.పార్టీ, ప్రజల మధ్య గ్యాప్ వల్లే ఓడిపోయామని, 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.