కాంగ్రెస్ పై పోచారం తిరుగుబాటు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల తీరుపై పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి రిజర్వాయర్ వద్ద బైఠాయించారు. బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రిపై విమర్శలు...
బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. తద్వారా భూములకు సాగునీరు అందే అవకాశం ఉండదని చెప్పారు. మంత్రులు, ముఖ్యమంత్రి తన ఫోన్ నుకూడా సమాధానమివ్వడం లేదని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మాట ఇచ్చి తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిధుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని 20సార్లు అడిగినా పట్టించుకోలేదని, ఈవయస్సు లో నిధులు మంజూరు చేయాలనీ మంత్రుల కాళ్లు మొక్కలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హాయంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.