Telangana : ఈ నెల 30వ తేదీ వరకూ రేషన్ పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో పేదలకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు

Update: 2026-04-13 04:38 GMT

తెలంగాణ రాష్ట్రంలో పేదలకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. దీంతో ఉదయం నుంచే షాపుల వద్ద బారులు తీరడంతో కొన్ని చోట్ల సర్వర్, ఈపోస్ మెషీన్లు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

స్టాక్ అయిపోవడంతో...
మరికొన్ని చోట్ల స్టాక్ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30వ తేదీ వరకూ రేషన్ పంపిణీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పేదలు మాత్రం ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News