కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీసులు

బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2026-04-13 07:30 GMT

బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులు జారీచేశారు. సోషల్ మీడియాలో తనపైన, ప్రభుత్వంపైన అనవసరపు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఆ పార్టీ అధినేత కేసీఆర్ కట్టడి చేయాలని మంత్రి సీతక్క కోరారు. నిందారోపణలు చేయడంతో పాటు కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా ఆరోపణలు చేయడమేంటని సీతక్క ప్రశ్నించారు.

మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను...
అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో మంత్రి సీతక్క స్పష్టం చేశారు.తమపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంతో తాము న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్ వెంటనే తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్టీఅధినేత అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు.


Tags:    

Similar News