నేడు ఢిల్లీలో కీలక భేటీ.. ఉప ఎన్నికపైనే?

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలు నేడు సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై వారు చర్చించనున్నారు

Update: 2022-08-01 07:04 GMT

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలు నేడు సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై వారు చర్చించనున్నారు. ఉప ఎన్నిక అనివార్యమన్న సంకేతాలు వస్తుండటంతో ఈ భేటీ కీలకంగా మారనుంది. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని రచించాల్సి ఉందన్న దానిపై సమావేశం కానున్నారు. అప్పటికప్పుడు హడావిడి పడితే ఇబ్బందిగా మారుతుందని నేతలు ముందుగానే భేటీ అవుతున్నారు. సరైన అభ్యర్థిని పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో ఏఐసీసీ ఉంది.

అనివార్యమని భావించి...
ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. జానారెడ్డిని ఏఐసీసీ ప్రత్యేకంగా సమావేశానికి పిలిచింది. పూర్తిగా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరగనుంది. సిట్టింగ్ స్థానం కావడంతో ఉప ఎన్నిక జరిగితే విజయం సాధించడం ఎలా? అన్న దానిపై కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభకు రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తుండటంతో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News