పెద్దపులి ఆ ప్రాంతంలోనే తిరుగుతుందట

కామారెడ్డి జిల్లాలో పులి సంచారం ఇంకా ప్రజలను భయపెడుతూనే ఉంది.

Update: 2025-07-17 02:06 GMT

కామారెడ్డి జిల్లాలో పులి సంచారం ఇంకా ప్రజలను భయపెడుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నా పెద్దపులి కనిపించడం లేుదు. గత ఐదు రోజుల నుంచి కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండాలో పెద్దపులి దాడి చేసి ఆవును చంపిన నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది పులి జాడ కోసం వెదుకుతున్నారు. దానిని పట్టుకునేందుకు ట్రాక్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేశారు.

గాలిస్తున్నా కనిపించక...
దాదాపు ముప్ఫయి మంది అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పెద్ద పులిని పట్టుకునేందుకు పని చేస్తున్నా అది మత్రం కనిపించడం లేదు. పెద్దపులి పాదముద్రలను బట్టి ఈ ప్రాంతంలోనే అది తిరుగుతుంని భావించి ప్రజలను రాత్రి పూట ఒంటరిగా తిరగవద్దని సూచించారు. చుట్టుపక్కల గ్రామస్థులు ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈరోజు గాలింపు చర్యలను నిలిపివేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News