డజను పెళ్లిళ్ల ఆరోపణల్లో నిజం లేదు.. తప్పుడు ప్రచారమే!!
రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గా నీలిమ తాను నిత్యపెళ్లి కూతురిని కాదని తెలిపారు
రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గా నీలిమ తాను నిత్యపెళ్లి కూతురిని కాదని తెలిపారు. విడాకులు తీసుకున్నానని చెప్పి మోసగించి, తనను పెళ్లి చేసుకున్న పాలకొల్లుకు చెందిన పాస్టర్, అతని కుటుంబసభ్యులే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నీలిమ ఆరోపించారు. నీలిమ తన తల్లి, తమ్ముడితో కలిసి మంగళవారం రామచంద్రపురం పోలీసు స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తాను పెళ్లి చేసుకుని మోసగించానంటున్న మిగతా 11 మందిని తీసుకువచ్చి ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు నీలిమ. ఆమె చాలా మందిని మోసగించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సీఐ వెంకటనారాయణ తెలిపారు.