Breaking : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణలోని భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు
IAS officers in telangana
తెలంగాణలోని భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఐఏఎస్ బదిలీలు జరగడంతో పాలనపరంగా ప్రక్షాళనను ప్రభుత్వం ప్రారంభించిందని భావించాలి. త్వరలో అనేక సంక్షేమ పథకాలను అర్హులకు అందచేయాలంటే సమర్ధులైన అధికారులను నియమించాలన్న కారణంతోనే ఈ బదిలీలు భారీగా జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
వీరికి బదిలీ ఉత్తర్వులు..
ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. జీహచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలె ఆమ్రపాలి నియమితులయ్యారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా శైలాజా రామయ్యర్ నియమితులయ్యారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జీఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డిని నియమించారు.