Telangana : గొర్రెల పంపిణీ స్కామ్ లో లేటెస్ట్ అప్ డేట్.. వారి మెడకు చుట్టుకున్నట్లేగా?

తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2025-08-03 04:07 GMT

తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గొర్రెల్ స్కామ్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనికి తోడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సయితం ఇటీవల తెలంగాణలో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు. మాజీ మంత్రి, నాటి పశువర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ నివాసంలో సోదాలు నిర్వహించి ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ స్కామ్ లో కేవలం ఓఎస్డీ, అధికారుల ప్రమేయం మాత్రమే ఉండదని బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు...
ఆ దిశగా ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమేయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రాధమికంగా నిర్ణయించారు. తెలంగాణలో మొదటి విడత మాత్రమే జరిగిన గొర్రెల పంపిణీ పథకం లో డమ్మీ వ్యక్తుల పేరిట అకౌంట్ లో జమ చేశారంటున్నారు. కొనుగోలు చేయాల్సిన సంఖ్యలో గొర్రెలను చేయకుండా, ఎక్కువగా చేసిననట్లు చూపించడమే కాకుండా గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారులు లెక్కల్లో చూపించారు. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసు అధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
వెయ్యి కోట్ల స్కామ్ అని...
పలువురు ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ గొర్రెల పంపిణీ స్కామ్ లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఎంత మేరకు ఉందన్న దానిపై త్వరలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. ఒక్కొక్క యూనిట్ కు ఇరవై గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కొక్క యూనిట్ మొత్తం వ్యయం 1.75 లక్షలు కాగా, ఇందులో నలభై ఐదు వేల రూపాయలు లబ్దిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. మాంసం ఉత్పత్తి పెంచడానికి ఈ గొర్రెల పంపిణీ ఉపయోగపడుతుందని భావించిన ప్రభుత్వం పథకం అమలులో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఈడీ అధికారులు కూడా ధృవీకరించారు. దీంతో ఈడీ అధికారులు త్వరలోనే మాజీ మంత్రులను కూడా విచారణకు పిలిచే అవకాశముంది.


Tags:    

Similar News