అధిక ఫీజులకు చెక్ పెట్టేలా సర్కార్ కసరత్తు ? త్వరలోనే నివేదిక

అధిక ఫీజులను నియంత్రించేలా.. ఫిబ్రవరి 21వ తేదీన మంత్రుల బృందంతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీ భేటీ కానుంది. విద్యాశాఖ..

Update: 2022-02-19 06:04 GMT

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆ ఫీజులు చూస్తే.. పిల్లల్ని బడిలో చేర్పించాలంటేనే భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఇక రోజూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్తూ.. ఫీజులు కట్టనివారిని వేధిస్తున్నాయి ప్రైవేటు విద్యాసంస్థలు. అలా అధిక ఫీజులు చెల్లించాలని విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. అధిక ఫీజులను నియంత్రించేలా.. ఫిబ్రవరి 21వ తేదీన మంత్రుల బృందంతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీ భేటీ కానుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహా సబ్‌కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేస్తుంది.

ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నిబంధనలపై విద్యాశాఖ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అంతా పరిశీలించి.. తుదిగా ఒక నివేదికను రూపొందించి దానిని మంత్రులకు సమర్పించనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంపై కూడా ఈ సబ్ కమిటీ చర్చించనుంది.




Tags:    

Similar News