అదో రహస్య జేబు.. 24 మద్యం సీసాలు దాచేశాడు

మద్యం అక్రమంగా రవాణా చేయడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ ఉన్నారు.

Update: 2025-06-22 10:30 GMT

మద్యం అక్రమంగా రవాణా చేయడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ ఉన్నారు. ఆబ్కారీ అధికారులు నిఘాను కట్టుదిట్టం చేసినా కూడా కొందరు అతి తెలివితో ప్రణాళికలను రచిస్తూ ఉన్నారు. ఇటీవల అక్రమ మద్యం రవాణాదారులను అదుపులోకి తీసుకోగా ఓ రహస్య జేబు బయట పడింది. ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌ మండలం పెండల్‌వాడకు చెందిన అశోక్‌ షర్టు వేసుకుని కనిపించాడు. అంతా బాగానే ఉంది కానీ, ఎక్కడో ఏదో అనుమానంగా అనిపించింది అధికారులకు. అతడి షర్ట్ ను నిశితంగా పరిశీలించగా లోపల ఓ జాకెట్ ఉంది. దీన్నే అక్రమ మద్యం రవాణాకు వినియోగించుకున్నాడు. జాకెట్ కు లోపలి వైపు ఏకంగా 24 సీసాలు పట్టే విధంగా జేబులు కుట్టించుకున్నాడు. అందులో మద్యం సీసాలను తరలించేటప్పుడు అధికారులకు దొరికిపోయాడు.

Tags:    

Similar News