బండి సంజయ్ పర్యటనలో టెన్షన్... కారు ధ్వంసం

సూర్యాపేట జిల్లా చిల్లేపల్లి లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై దాడి జరిగింది.

Update: 2021-11-15 13:06 GMT

సూర్యాపేట జిల్లా చిల్లేపల్లి లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై దాడి జరిగింది. ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బండి సంజయ్ ఈరోజు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రైతులను కలసి వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం పాత్రను ఆయన వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి బండి సంజయ్ యాత్ర టెన్షన్ తోనే సాగింది.

కార్లపై రాళ్ల దాడి....
టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చిల్లేపల్లిలో బండి సంజయ్ కార్లపై కొందరు రాళ్ల దాడికి దిగారు. టీఆర్ఎస్ కార్యకర్తలే కారుపై రాళ్ల దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదర గొట్టేందుకు ప్రయత్నాాలు చేస్తున్నారు.


Tags:    

Similar News