Nagarjuna Sagar : కృష్ణా నదిలో లాహిరి లాహిరిలో

కృష్ణానదిలో లాంచీ ప్రయాణానికి తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది

Update: 2025-11-29 12:15 GMT

కృష్ణానదిలో లాంచీ ప్రయాణానికి తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి "నాగార్జునసాగర్ టు శ్రీశైలం" లాంచీ ప్రయాణం ప్రారంభం అయింది. కృష్ణానది ఒడిలో.. నల్లమల్ల కొండల పచ్చని ప్రకృతి మధ్యన సాగే "నాగార్జునసాగర్ టు శ్రీశైలం" లాంచీ ప్రయాణం కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ నుంచి లాంచీలో శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు.. ఒకవైపు వెళ్లేవారికి పెద్దలకు 2,000 రూపాయలు.. పిల్లలకు 1,600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

శ్రీశైలం వరకూ....
అలాగే సాగర్ నుంచి లాంచీలో శ్రీశైలం వెళ్లి తిరిగి అదే లాంచీలో మరుసటి రోజు సాగర్ రావడానికి పెద్దలకు 3,250 రూపాయలు, పిల్లలకు 2,600 రూపాయలుగా టికెట్లను కేటాయించారు. లాంచీ ప్రయాణంలో మధ్యాహ్నం భోజనం సౌకర్యం లాంచీలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని పర్యాటక రంగ సంస్థ అధికారులు తెలిపారు. కృష్ణా నదిలో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుందని తెలిపారు. ఆసక్తి గల ఉన్న వారు ముందుగా పర్యాటక రంగ సంస్థ వెబ్ సైట్ ద్వారా కానీ, నేరుగా అక్కడకు వచ్చి బుక్ చేసుకోవచ్చని తెలిపారు.


Tags:    

Similar News