స్వేచ్ఛకు కాంగ్రెస్ కారణం.. రేవంత్

తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు గాంధీ భవన్ లో జరిగాయి. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Update: 2022-09-17 06:55 GMT

తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు గాంధీ భవన్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. నిజాం నవాబులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారన్నారు. భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాటం జరిపారన్నారు. బైరాన్‌పల్లి ఘటనలు తెలంగాణలో అనేకం జరిగాయన్నారు. ఈ స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని తెలంగాణకు ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి అన్నారు.

నిజాం నవాబులకు...
భూ కామందులకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎందరో తెలంగాణలో ఉన్నారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ నాయకత్వం అప్పుడు నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. ఆ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. తాడిత, పీడిత ప్రజల కోసం నాడు పోరాటం చేశారన్నారు. ఆ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమురం భీమ్ వంటి వారు వేలాది మంది గుండెల్లో ధైర్యం నింపారన్నారు.
గౌరవాన్ని కాపాడుతూ...
75 వ వసంతంలో స్వతంత్ర వేడుకలను జరుపుకుంటున్న మనం ఆ గౌరవాన్ని కాపాడాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. కానీ ఈరోజు చరిత్రను వక్రీకరించి కొందరు రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ను చులకన చేసి కొందరు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీయే బ్రిటీష్ పాలకుల నుంచి స్వతంత్రం నుంచి తెప్పించిందన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించడానికి నాటి హోంమంత్రి పటేల్, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృషి చేశారన్నారు. ఇప్పుడు కూడా అణగారిన వర్గాల దోపిడీకి గురవుతున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News