మూసీ నది ప్రక్షాళన కోసం నిధులు విడుదల

మూసీ నది ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది

Update: 2025-02-02 05:50 GMT

మూసీ నది ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇల్లు ఖాళీ చేసి వెళుతున్న వారికోసం నిధులను విడుదలచేసింది. ఇందుకోసం 37,50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు...
ఈ మేరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇళ్లను ఖాళీ చేసి వెళుతున్న వారికి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. గత కొంత కాలంగా మూసీ నది ప్రక్షాళన కోసం నోటీసులు ఇచ్చి కొందరిని ఖాళీ చేయిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది.


Tags:    

Similar News