Telangana :తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం
తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది
తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బాధితుల నుంచి ఫిర్యాదులను ఇంటివద్దకే వెళ్లి స్వీకరించాలని నిర్ణయించింది. పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధితులు ఫిర్యాదు చేయలేకపోతే తమకు సమాచారం ఇస్తే వారి ఇంటివద్దకే వెళ్లి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయం కీలకమనే చెప్పాలి.
ఇంటివద్దకే పోలీసులు...
బాధితులకు అండగా నిలబడేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై పోలీస్ స్టేషన్ కు వచ్చిఫిర్యాదుచేయడానికి భయపడే వారు ఎవరైనా ఫోన్ చేస్తే చాలు వెంటనే పోలీసులు మీ ఇంటికే వచ్చి ఫిర్యాదులను నమోదు చేసుకుంటారని, తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారని తెలంగాణ పోలీసు శాఖ వెల్లడించింది.